స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: థాయ్‌లాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయింది. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో పాటు 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చికోటి ఆధ్వర్యంలో పటాయలోని ఓ హోటల్‌లో భారీ ఎత్తున్న గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో థాయ్ పోలీసులు హోటల్ పై దాడులు నిర్వహించడంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. అరెస్ట్ అయిన వారిలో భారతీయులతో పాటు విదేశీయులు, 14 మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చికోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా నగదుతో పాటు గేమింగ్ చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ కోసం కొంతమంది భారతీయులను థాయ్‌లాండ్ తీసుకెళ్లాడు చికోటి ప్రవీణ్. థాయ్‌లాండ్ దేశంలో జూదంపై నిషేధం ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.