సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, గనుల్లో తెలంగా ణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహ రించారని మండిపడ్డారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. జులై 5న బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కలెక్టరేట్‌లను ముట్టడిస్తాం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో ధైర్యంగా ఉండాలని కూనంనేని కోరారు.