జార్ఖండ్ ఈడీ దాడుల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మంత్రి ఆలంగీర్ కార్యదర్శి సంజీవ్ పని మనిషి ఇంట్లో సోదాలు చేసిన సమయంలో గుట్టలు గుట్టలు నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ నగదు సుమారు 30 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లెక్కించడానికి క్యాష్ కౌంటింగ్ మెషీన్లను కూడా తరలించారు. మనీల్యాండరింగ్ కేసులో చీఫ్ ఇంజినీర్‌ను గతేడాది అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇవాళ జార్ఖండ్‌లోని రాంచీలో ఆరు చోట్ల ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. క్యాష్‌ను కౌంట్ చేసేందుకు కౌంటింగ్ మెషీన్లను కూడా తరలించారు.
నగదుకు సంబంధించి ఎలాంటి లెక్కా పత్రాలు లేవని అధికారులు అంటున్నారు. మనీల్యాండరింగ్ నిరోధకం చట్టం కింద ఫిబ్రవరి 2023లో అరెస్టయిన వీరేంద్ర రామ్‌కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. నగదుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవాళ ఉదయం రాంచీలోని సెయిల్ సిటీలో సహా తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిం చామని ఈడీ వెల్లడించింది. మరోవైపు రోడ్ కన్స్‌స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కు చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం మరో ఈడీ బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు.


