అసంఘటిత రంగాల(గిగ్) ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ ద్వారా వారికి గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. దీంతో కోటి మంది గిగ్ వర్కర్లకు లాభం చేకూరనుంది.
గిగ్ వర్కర్లకు ఈ- శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు.
అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం త్వరలో ప్రత్యేక పథకం తీసురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారామె.