వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయని మండిపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అన్ని శాఖల్లో అవినీతి చేశారు కాబట్టే..రికార్డులు, ఫైల్స్ తగలబెడుతున్నారని ఆయన అన్నారు. గతంలో వైయస్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారని..ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూ కట్టబోతున్నారని చెప్పారు. అటాచ్ చేసిన ఆస్తులను కూడా జోగి రమేష్ స్వాహా చేశారని మండిపడ్డారు. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని.. ఆయన అడుగు జాడల్లో ఆపార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారని చెప్పారు. తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడక తప్పదని బుద్ధావెంకన్న స్పష్టం చేశారు.