స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తిరిగి విజయం సాధిస్తుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని అన్నారు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో పలు వార్డులకు సంబంధించిన పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానన్న మంత్రి.. 80 వేల మెజారిటీతో గెలుస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వ్యక్తులు అబద్దాలతో ప్రజలని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాంటి వారి మాటలు అస్సలు నమ్మవద్దని అన్నారు.