చంచల్‌గూడ జైలు నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిశాంక్ లేఖ రాశారు. తన అరెస్టును వ్యతిరేకిస్తూ, మాట్లాడినందుకు బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు తనకు మద్దతుగా నిలిచి తనలో ధైర్యాన్ని నింపార న్నారు. తనకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓయూ ఒరిజినల్ సర్క్యులర్‌ను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని, తన లెటర్ ఫోర్జరీ అని రుజువైతే ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నకిలీ లెటర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.


