బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంతో దిలీప్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ అనంతరం ఆయన్ను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో దిలీప్‌ను హాజరుపరచనున్నారు పోలీసులు. దిలీప్ అరెస్ట్‌పై స్పందించారు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం మానుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు హరీష్‌రావు.