జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిర్లు కాంగ్రెస్‌లో చేరారు. వారికి జీవన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనం తరం బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసివేసి, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారన్నారు. మోదీ అభిప్రాయాన్ని అరవింద్ వ్యక్త పరుస్తున్నారని జీవన్‌రెడ్డి మండిప డ్డారు. యూనిఫాం సివిల్ కోడ్, NRC, 370 ఆర్టికల్‌పై తమ పార్టీ విధానమే తన విధానం అన్నారు జీవన్‌రెడ్డి.


