Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

కాంగ్రెస్ దూకుడుతో ప్రచారతీరు మార్చుకున్న గులాబీ పార్టీ!

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లోకి దూసుకువెళుతోంది. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు జనంలోకి చొచ్చుకుపోతున్నాయి. డిక్లరేషన్‌లతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హడావిడి చూసి గులాబీ పార్టీ కూడా అప్రమత్తమైంది. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్‌గా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇప్పటివరకు పట్టించుకోని కొన్ని వర్గాలను అక్కున చేర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వరాల మీద వరాలు ప్రకటిస్తోంది గులాబీ పార్టీ.

తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. డీకే శివకుమార్ సహా కర్ణాటకకు చెందిన పలువురు సీనియర్ నేతలు హైదరాబాద్‌లోనే మకాం పెట్టారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఇందుకు తగ్గట్టు నిర్ణయాలు ప్రకటిస్తోంది. కర్ణాటక నేతలే కాదు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక కూడా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దాదాపు రెండు నెలల కిందట ఆరు గ్యారంటీలు ప్రకటించారు. మహిళలు, రైతులు, యువతకు ఆరు గ్యారంటీల్లో పెద్దపీట వేశారు. పేద, మధ్యతరగతి మహిళలను ఆదుకోవడానికి రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అలాగే కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు పదిహేను వందల రూపాయలు అందచేస్తామన్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అందచేస్తామన్నారు. ఆరు గ్యారంటీల్లో గృహ జ్యోతి కీలకమైనది. గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల మేర ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు.

ఆరుగ్యారంటీల్లో గూడు లేని నిరుపేదలను చేర్చింది. ఇండ్లు లేని పేదవారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు అందచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల సాయం అందచేస్తామని పేర్కొంది. ఇక చివరిగా చేయూత పథకాన్ని చేర్చింది కాంగ్రెస్ పార్టీ. చేయూత కింద సీనియర్ సిటిజన్లకు నెలకు నాలుగు వేల రూపాయలను పెన్షన్ కింద ఇస్తామన్నారు సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో డిక్లరేషన్‌లను గ్యారంటీ కార్డులుగా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు పంచడం మొదలెట్టారు. దీంతో కాంగ్రెస్ శిబిరంలో సందడి నెలకొంది. ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా అభయహస్తం పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలతో పాటు అభయహస్తం మేనిఫెస్టో కూడా జనంలోకి చొచ్చుకువెళుతోంది. ఏమైనా ఇటు ఆరు గ్యారంటీలు అటు అభయహస్తంతో తుదిదశలో ఎన్నికల ప్రచారాన్ని హెరెత్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ దూకుడు చూసి అధికారపార్టీ అయిన భారత్ రాష్ట్ర సమితి అప్రమత్తమైంది. వ్యూహాత్మకంగా తన ప్రచార శైలిని మార్చుకుంది. విభిన్న వర్గాలకు వరాల మీద వరాలు ప్రకటిస్తోంది. తాజాగా మానకొండూర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తూ ఆటో డ్రైవర్లకు వరాలు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఏడాదికోసారి ఫిట్ నెస్ సర్టిఫికెట్‌ కోసం ఆటో డ్రైవర్లు పెట్టే ఫీజు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఏడాదికోసారి ఆటో డ్రైవర్లు 1,200రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు కేసీఆర్‌. భవిష్యత్తులో తెలంగాణవ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఫీజు బాధ ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

ఆటో డ్రైవర్లు ఒక్కరే కాదు అన్నదాతలు, రైతు కూలీలను ఆకట్టుకోవడానికి కూడా బీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది. ఈ వర్గాలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించడానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. రైతుకూలీలకు ఏ క్షణాన్నైనా బీఆర్ఎస్ వరాలు ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గత తొమ్మిదిన్నరేళ్లుగా యువత ఉపాధి అవకాశాల అంశాన్ని పట్టించుకోని గులాబీ పార్టీ సర్కార్‌కు అకస్మాత్తుగా విద్యార్థులపై ప్రేమ పుట్టుకొచ్చిందన్న విమర్శ తాజాగా పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. హైదరాబాద్‌లోని టీ హబ్‌లో యువత, విద్యార్థులతో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ సర్కార్ అనేక చర్యలు చేపట్టిందంటూ ఈ ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ఊదరగొట్టారు. అయితే టీ హబ్‌లో ఆత్మీయ సమ్మేళనం పేరుతో యువత, విద్యార్థులనుద్దేశించి కేటీఆర్‌ రాజకీయ ప్రసంగం చేశారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కథ అక్కడితో ఆగలేదు. కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ ఫిర్యాదు సంగతి ఎలాగున్నా, ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ వరాలు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరచింది. గత తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితియే అధికారంలో కొనసాగుతోంది. అయితే ఎప్పుడూ ఆటో డ్రైవర్ల మేలు కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేకించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవంటున్నారు పొలిటికల్ పండిట్లు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో బెంబేలెత్తిన గులాబీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఆటో డ్రైవర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతోంది. కాగా కేసీఆర్ తాజాగా ఆటో డ్రైవర్లకు ప్రకటించిన వరాలను ఎన్నికల జిమ్మిక్కులుగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ జిమ్మిక్కులు ఈ ఎన్నికల్లో ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాల్సిందే.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్