బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్ రామిరెడ్డికి సంబందించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారని అన్నారు. అయినా పోలీసులు వెంకట్ రామిరెడ్డి ని కాపాడుతున్నారని అన్నారు. ఆయన మంత్రి పొంగులేటి వియ్యంకుడు అయినందునే అతడిని అరెస్టు చేయడం లేదా? రఘునందన్ ప్రశ్నించారు.