రాష్ట్రంలో వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన చోట బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన చోట తాము ఓట్లు అడుగుతాం అని పొన్నం ఎద్దేవా చేశారు. రాష్ట్రం 7లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. 40వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. రాష్ట్రానికి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు


