ఇటీవల దేశంలోని చాలా రాజకీయ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లను నియమించుకుంటున్నారు. వారిలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం చాలా ఫేమస్ అయింది. అనేక రాష్ట్రాల్లో ఐప్యాక్ తో ఒప్పందం చేసుకున్న పార్టీలు అధికారంలోకి కూడా వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ కూడా ఐప్యాక్ తో గతేడాది ఒప్పందం చేసుకుంది. పార్టీ డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం బలోపేతం చేయడంతో పాటు మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ కోసం ఆ సంస్థ పనిచేసింది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ బిహార్ లో సొంతగా పార్టీ పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం కోసం ఐప్యాక్ టీం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.