Women’s Reservation Bill |మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఉద్యమం ఉదృతం చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ ఇవాళ లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు. అలాగే ఇదే అంశంపై త్వరలో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని భారత జాగృతి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు రాయనున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా చేయాలని ఎమ్మెల్సీ కవిత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: నేడు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ
Follow us on: Youtube, Instagram, Google News