23.1 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ..

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. హుస్నాబాద్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు సీఎం కేసీఆర్ కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ బస్సును అందించారు. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్సు ఇటీవలే హైదరాబాద్ కు చేరుకుంది.

ఆదివారం (నేడు) జరగనున్న హుస్నాబాద్ ప్రచార సభలో ఈ బస్సును కేసీఆర్ ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఈ ప్రచార రథం హుస్నాబాద్ కు పయనమైనట్లు సమాచారం. ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో, కారు గుర్తు, భారతదేశ పటంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తం గులాబీ రంగుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్