తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీ యం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే.. మరొకరు చలో పాలమూరు, రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారే జ్‌కు బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వం కాళేశ్వ రం అంశంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టునే ఫెయిల్యూ ర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడతున్నారు. అధికార పార్టీ ఆరోపణలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రాజక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
బ్యారేజిలో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయించి వచ్చే యాసంగికి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రులు కడియం, హరీశ్ రావు అన్నా రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించ బోతున్నారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలు వెల్లడించబో తున్నారు.కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ పర్య టన చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ బాధ్యత మరించిందని ఫైరయ్యారు.
మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీ లిస్తామన్నారు కేటీఆర్.కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా కేసీఆర్ నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగినట్లు, లేనిది ఉన్నట్లు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ప్రాజెక్టు పునరద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారాయన.


