24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పిలుపు

రుణమాఫీ రగడతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ ఫైట్‌ మరింత ముదిరింది. ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా డెడ్‌లైన్‌ ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్‌ నేతలు చెబుతుంటే.. రుణమాఫీతో రైతులను రేవంత్‌ సర్కార్‌ మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. ఈ క్రమంలోనే రుణమాఫీ అమలులో లోపాలను నిరసిస్తూ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టింది బీఆర్‌ఎస్‌. ఎలాంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు దిగారు బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఇక ఆందోళన నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలన్నది ముందుగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యనేతలు ఆందోళనలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలు పాల్గొననుండగా… చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌రావు పాల్గొంటారు.

ఆలేరు ధర్నా కంటే ముందుగా హరీష్‌రావు యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్టు వేసి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇందుకు పాప పరిహారంగా తెలంగాణ ప్రజల కోసం యాదాద్రి దేవాలయంలోతాను పూజలు చేస్తానని తెలిపారు హరీష్‌రావు. ఈ క్రమంలోనే యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు మాజీ మంత్రి.

గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కనీసం 49వేల కోట్ల రుణాలు ఉన్నాయని, వాటిని మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత 40 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినా, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం 31వేల కోట్లు మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఈ సారి బడ్జెట్‌లో రుణ మాఫీ కోసం కేవలం 26వేల కోట్లకు కుదించారన్నది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న కీలక అభియోగం. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణ మాఫీలో భాగంగా 2లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఆ రోజుకు 17వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశామని, ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీని పూర్తి చేశామని ప్రకటించారని బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది.

డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రుణమాఫీ ఒట్టిదేనని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ 40 శాతంసైతం పూర్తి కాలేదని అన్నారు. సీఎం ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో 20 వేల 239 రైతుల ఖాతాలు ఉంటే 8 వేల 527 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని తెలిపారు కేటీఆర్‌. ఇక తలమడుగు, బజార్ హత్నూర్ మండలంలో రైతులపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారని.. ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్‌. ఇకపోతే రైతు రుణమాఫీపై తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఇప్పటికే ఆందోళన బాటపట్టారు. పలుచోట్ల బ్యాంక్‌ అధికారులను నిలదీస్తున్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు.

Latest Articles

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం బేలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్