32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
spot_img

ప్రతిపక్షంలో ఉన్నా తగ్గని బీఆర్ఎస్‌ ఆస్తులు

ప్రతిపక్షంలోను గులాబీ పార్టీ ఆస్తులు తగ్గలేదా…? ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బిఆర్ఎస్ నిలిచిందా…? బిఆర్ఎస్ ఆస్తులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందా…? కేంద్ర ఎన్నికల సంఘం ఆడిట్ రిపోర్టులో ఏం చెప్పింది? రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది?

బిఆర్ఎస్ ఆస్తుల అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల వార్షిక ఆడిట్ రిపోర్టును ప్రకటించింది. ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికి బిఆర్ఎస్ ఆస్తులు తగ్గలేదు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బిఆర్ఎస్ నిలిచింది. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ నిలిచింది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పదేళ్ల పాటు పవర్ లో ఉంది. దీంతో పార్టీ పరంగా తన ఆస్తులను పెంచుకుంది. ప్రతి సంవత్సరం రాజకీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పార్టీల ఆడిట్ రిపోర్టును విడుదల చేస్తుంది.

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన దాని ప్రకారం బిఆర్ఎస్ పార్టీ ఆస్తులు రూ.1,618 కోట్లుగా పేర్కొంది. గులాబీ పార్టీ బ్యాంకు ఖాతాలో రూ.1,110 కోట్లు ఉన్నట్లు చెప్పింది. ఇక 2023-2024 సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీకి రూ. 580 కోట్లు విరాళాలు వచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా రూ.101.76 కోట్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.197 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆడిట్ రిపోర్టులో స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తరపున పోటీ చేసిన ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్కును ఇచ్చారు. రాష్ట్రంలో 119 అభ్యర్థులకు రూ.47 కోట్లు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు, ఇతర ప్రకటనలు, ప్రచారానికి రూ.147 కోట్లు ఖర్చు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ పేరును బిఆర్ఎస్‌గా మార్చింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని భావించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆఫీసుల నిర్వహణకు బిఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ రాజధాని ఢీల్లిలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి రూ.15 కోట్లు ఖర్చు చేసింది. కోకాపేటలో 11 ఎకరాల భూమి కోసం రూ. 7 కోట్లు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం రూ.25 కోట్లకు పైగా బిఆర్ఎస్ ఖర్చు చేసింది.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ ధనిక పార్టీ అని అనేక సార్లు కామెంట్స్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పార్టీ ఆస్తులను పెంచుకున్నారు. దీంతో బిఆర్ఎస్ ధనిక పార్టీగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు జాతీయ పార్టీ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం గులాబీ వర్గాల్లో వ్యక్తం అయింది.

బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కేంద్ర ఎన్నికల సంఘం ఆడిట్ రిపోర్టులో ఆస్తులు తగ్గలేదు. దీంతో రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ఆస్తులు పెరుగుతాయా? లేదా? అనేది చూడాలి.

Latest Articles

చంద్రబాబు, పవన్, మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ని బలపరుస్తూ..ఏపీ ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ, నరేంద్ర మోడీ సహకారం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్