బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. తన పేషీలోని సిబ్బందిని ఆయన బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రధాని రిషి సునాక్ సీనియర్ న్యాయవాది అడమ్ టోలీ నేతఈత్వంలో దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక ప్రధానికి అందిన కొద్ది గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రిషికి రాసిన రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజీనామా చేసినా తన మద్దతు తాను ప్రభుత్వానికి ఉంటుదంని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలినా సరే.. మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా రాబ్ గతేడాది ఉపప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq
— Dominic Raab (@DominicRaab) April 21, 2023