స్వతంత్ర వెబ్ డెస్క్: కరీబియన్ గడ్డపై రెండు సిరీస్‌లు గెలిచిన టీమిండియా(Team India).. షార్ట్ ఫార్మాట్‌లో బోల్తా కొట్టింది. టార్గెట్ ఛేజింగ్‌లో బ్రెండన్ కింగ్ (55 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85 నాటౌట్), నికోలస్ పూరన్ (32 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 47) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో విండీస్(Windes) 8 వికెట్ల తేడాతో ఇండియాకు షాకిచ్చింది. దాంతో 3–2తో సిరీస్ సొంతం చేసుకుంది.
పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. రొమారియో షెఫర్డ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత విండీస్ 18 ఓవర్లలో 171/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అర్ష్‌దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. బ్రెండన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.