స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నేటి యువత పెడదోవ పడుతున్నారు. శారీరక సుఖం కోసం కొంతమంది, ఆర్థిక సంబంధాల కోసం మరికొంతమంది తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో ఇతరుల ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడడం లేదు. ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు పరిశీలిస్తే యువత ఎంతలా దారి తప్పుతున్నారో అర్థమవుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటుచేసుకుంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.
పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు విశాఖలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న శ్రావణి అనే వివాహితను ప్రేమిస్తున్నాడు. శుక్రవారం అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఇద్దరు కలిసి బీచ్‌కు వచ్చారు. అయితే ఇంతలో వీరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఆమెను గోపాలకృష్ణ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం గాజువాక పోలీస్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.