25.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ఇద్దరూ సీనియర్లే ……. గెలుపు ఎవరిది?

   నిజామాబాద్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు కాకరేపుతున్నాయి. రాజకీయ ఉద్దండులిద్దరూ సై అంటే సై అంటూ లోక్‌సభ పోరులో కాలుదువ్వుతున్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆ ఇద్దరూ ఒకప్పుడు ఒకగూటి పక్షులే. అయితే,.. పలుమార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈ సీనియర్లు తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచారు. మరి ఎవరి రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుంది.? విజయం ఎవరిని వరిస్తుంది.? వారికి కలిసొచ్చే అంశాలేంటి..?

  ఇందూరు గడ్డపై పార్లమెంట్ బరికి కాలుదువ్వుతున్న ఇద్దరు నేతలు రాజకీయ రంగంలో ఉన్నవారికి సుపరితమే. వారెవరో కాదు.. జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌. ఈ ఇద్దరు పాలిటిక్స్‌లో ఎంతో అనుభవం ఉన్న నేతలు. మరోవైపు ఈ ఇద్దరూ ఒక గూటి పక్షులే కూడా. అయితే,.. ప్రత్యర్థులుగా మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సై అంటున్నారు. జీవన్ రెడ్డికి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ..కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారే. అయితే,.. బాజిరెడ్డి లోకల్‌ లీడర్‌ కాగా.. జీవన్‌రెడ్డి నాన్‌లోకల్‌ పర్సన్‌. ఈ అంశం పక్కన పెడితే,…ఈ ఇద్దరు మంచి పేరున్న నాయకులు. రాజకీయ అనభవంలో ఎవరికి ఎవరూ తక్కువ కాదు.

      ఇకపోతే ఈ ఇద్దరికి రాజకీయ అనుభవం ఏ మేర కలిసిరానుంది..? వీరి విక్టరీకి ప్లస్‌ అయ్యే అంశాలేంటి..? అనుభవం వీరిని నెగ్గిస్తుందా..? ఇద్దరు ఉద్దండుల పోరు ఎలా ఉండనుంది అనేదే జిల్లాలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. జీవన్ రెడ్డి జిగిత్యాల జిల్లా నేత. పట్టభద్రుల ఎమ్మెల్సీతో నిజామాబాద్ జిల్లాకు పరిచయమయ్యారాయన. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయనను నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. అయితే, హస్తం పార్టీ అధికారంలో ఉండటం, జిల్లాకు పూర్వ వైభవంతో పాటు ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఇందూరు ఉండటం ఇవన్నీ జీవన్‌రెడ్డికి కలిసివస్తాయని.. విక్టరీ ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. మిగతా 5 స్థానాల్లో ఓటింగ్ శాతం పెంచుకుంది. మైనార్టీలు, ఎస్సి, ఎస్టీ, బీసీల ఓట్లు కలిసొస్తా యన్న నమ్మకంతో ఉంది. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. వాక్ చాతుర్యం కలిగిన నాయకుడు. మాస్ లుక్ ఉన్న లీడర్‌. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సానుభూతిగా మారే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు. మరోపక్క లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన పార్టీ సీనియర్‌ నేతలు జీవన్‌రెడ్డి గెలుపు కోసం పని చేయడం, సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జీవన్‌రెడ్డికి కలిసొచ్చే అంశాలు.

  జీవన్‌రెడ్డిపై కాలుదువ్వుతున్న బాజిరెడ్డికి మాస్‌ లీడర్‌గా కింది స్థాయి నుంచి పైకొచ్చిన నేతగా మంచి పేరుంది. నిజామాబాద్‌ 5 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఆయనకు మంచి పట్టు, పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికే రూరల్‌లో రెండు సార్లు, ఆర్మూర్‌లో ఒకసారి, బాన్సువాడలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మేజర్‌ ఓట్లు ఉన్న సామాజిక వర్గం నాయకులు కూడా. అయితే,.. మొన్నటి ఎన్నికల్లో రూరల్ నుంచి ఓటమి పాలయ్యారు బాజిరెడ్డి. అయినప్పటికీ ఆయనే సరైనోడు అని భావించిన బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ పార్లమెంట్ బరిలో దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ ఎలాగైనా లోక్‌సభ ఎలక్షన్‌లో గెలిచి సత్తా చాటాలన్న కసిలో ఉంది. అయితే,..  సీనియారిటీ, సింపతీతోపాటు బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అభివృద్ధి పనులు బాజిరెడ్డికి కలిసొచ్చే అవకాశముందున్న టాక్‌ వినిపి స్తోంది. మరి రాజకీయ ఉద్దండులైన ఇద్దరు నేతల బలాబలాలు సమానంగా ఉన్న తరుణంలో ప్రజలు ఎవరిపక్షాన ఉంటారు..? ఎవరికి పట్టం కడుతారు అన్నది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్