స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశమంతటా డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. అవసరమైన ప్రతి దానికి డిజిటల్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు జనాలు. దీంతో కొన్ని సంస్థలు పే లేటర్ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో IRCTC కూడా రైలు టికెట్ బుకింగ్ కోసం ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ మేరకు పేటీఎం, క్యాష్‌ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్‌పెయిడ్ కింద పేటీఎం ఈ వెసులుబాటు కల్పిస్తుండగా.. ‘ట్రావెల్ నౌ పే లేటర్’ పేరిట క్యాష్‌ఈ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.
*పేటీఎం ద్వారా ఈ ఆప్షన్ పొందాలంటే ముందుగా IRCTC పోర్టల్‌లో లాగిన్ కావాలి. అనంతరం ప్రయాణం వివరాలు నమోదుచేయాలి. తర్వాత బుక్ టికెట్‌పై క్లిక్ చేసి పేమెంట్ సెక్షన్‌లో పే లేటర్ ఆప్షన్‌ను ఎంచుకొని పేటీఎం పోస్ట్‌పెయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తదుపరి పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే మీ టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
* అలాగే క్యాష్‌ఈ ద్వారా అయితే IRCTC యాప్ లో ప్రయాణ వివరాలను ఎంటర్ చేసి బుక్ టికెట్‌ఫై క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్లలో ‘ట్రావెల్ నౌ పే లేటర్’ను సెలెక్ట్ చేయాలి. అనంతరం మీ వివరాలు పొందుపరిస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది.
** ఇందుకుగానూ ఈ రెండు సంస్థలు EMI ఆప్షన్లు కూడా అందిస్తున్నాయి.


