27.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

అంగరంగా వైభవంగా మొదలైన బోనాల ఉత్సవాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణాలో బోనాల పండుగ ఘనంగా మొదలైంది. బోనాలలో పోతురాజులు, భాజా భజంత్రీలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. లంగ‌ర్ హౌస్ నుంచి ర‌థం, తొట్టెల ఊరేగింపు ప్రారంభ‌మై గోల్కొండ కోట‌లోని జ‌గ‌దాంబ ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆల‌య క‌మిటీ స‌భ్యులు, ప్రధానార్చకుల ఇంట్లో ఘ‌నంగా పూజ‌లు నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. భాగ్యనగరం అంతటా సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశంలోని హిందువుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ, హిందువుల పండుగలకు అండగా నిలిచేది సీఎం కేసీఆర్ అని అన్నారు. యాదాద్రిని దేశం మొత్తం చెప్పుకునే విధంగా సీఎం కేసీఆర్ 1200 కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని మంత్రి తలసాని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోల్కొండ జగదాంబిక అమ్మవారి జాతర చాలా తక్కువ మందితో జరిగేది. కానీ, ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించి ఆషాడ మాసం మొత్తం బోనాల జాతర కొనసాగుతుందని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ బోనాలకు తరలివస్తారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా బోనాల జాతర వైభవంగా నిర్వహిస్తున్నామని, పండుగకు ముందు బోనాల పండుగకు 15 కోట్ల రూపాయలు ఇచ్చామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగ‌ల్లో ఒకటైన బోనాల పండుగ‌ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ‌గా ప్రకటించిందన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింద‌ని చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు బోనాల నిర్వణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధుల‌ను ప్రతీ సంవ‌త్సరం 3,033 ఆల‌యాల‌కు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుందని వెల్లడించారు. బోనాల పండుగ‌కు ముందు తొల‌క‌రి ప‌ల‌క‌రింపు శుభ‌సూచ‌కంగా భావిస్తున్నామ‌న్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజ‌ల‌పై ఉండాల‌ని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని అకాంక్షించారు.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్