హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్టులో బాంబ్ పెట్టినట్టు సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చివరకు ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అది ఫేక్ కాల్‌గా గుర్తించారు.
బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేశారు ఎయిర్ పోర్ట్ అధికారులు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణ కామారెడ్డి వాసిగా గుర్తించారు. నిందితుడిని గుర్తించిన అధికారులు అతనిని పట్టుకుని విచారణ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చారు. మరోవైపు ఎయిర్ పోర్టులో బాంబు లేదని తేలడంతో అటు అధికారులు, ఇటు సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


