బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శత్రుత్వం ఆగిపోవాలంటే 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెజేజ్ వచ్చింది. ఈ వాట్సాప్ సందేశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని..తాము డిమాండ్ చేసినట్టు డబ్బు ఇవ్వకపోతే.. మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామంటూ హెచ్చరించారు. ఈ సందేశంపై ముంబయి పోలీసులు విచారణ చేపట్టారు.