బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ.. గత కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. గతంలోనూ అస్వస్థతతో ఆయన ఆస్పత్రిలో చేరినా.. వెంటనే కోలుకున్నారు.