Delhi | దేశ రాజధాని ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టి అభ్యర్థులను పార్లమెంటరీ బోర్డు ఫైనల్ చేయనుంది. అభర్ధులను ఫైనల్ చేసే విషయంలో ఇప్పటికే కర్ణాటక ముఖ్యనేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే విషయంపై కూలంకషంగా చర్చించారు. అయితే నేడు జరుగనున్న పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని.. రేపు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.