కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవినీతిలో జైలుకెళ్లి బెయిల్‌పై తిరుగుతున్న నేతలు నీతులు చెపుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ దుష్ప్రచా రాన్ని నమ్మరన్నారు లక్ష్మణ్.
గతంలో కాంగ్రెస్ ముస్లింకు 4 శాతం రిజర్వేషన్ల ఇస్తే..తాను 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కేసీ ఆర్ మోసం చేశారన్నారు లక్ష్మణ్. ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తారని రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తొమ్మిదేళ్ళలో అధికార అహంకారం పెరిగే. .రేవంత్‌రెడ్డికి తొమ్మిది నెలలు కూడా కాకుండా అహంకారంతో మాట్లాడుతున్నాని మండిపడ్డారు. తెలం గాణలో రేవంత్ రెడ్డి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ముస్లిం ఓట్ల కోసం గతంలో కేసీఆర్ హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా మాట్లాడారని, ఇప్పుడు కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తు న్నారని మండి పడ్డారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించి, ముస్లింల రిజర్వేషన్లు పెంచితే…హైకోర్టు మొట్టికాయాలతో దిగొచ్చారని లక్ష్మణ్ గుర్తుచేశారు.


