ఫోన్ ట్యాపింగ్ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ గవర్నర్ను కలిశారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులెవరో తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం గవర్నర్ని కలిసి మెమొరాండం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వం అత్యంత దారు ణానికి పాల్పడిందని ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు, సినీ ప్రముఖులు ఫోన్లు, వ్యాపార వేత్తల ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. విదేశాల నుండి సాప్ట్ వేర్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారని.. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేవలం పాత్ర దారులు అరెస్ట్ అవుతున్నారని.. మరి సూత్రదారుల సంగతి బయటి రావడం లేదని లక్ష్మణ్ అన్నారు.


