25.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

బీజేపీకి ఆశించినస్థాయిలో సీట్లు రాని పరిస్థితి !

   ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు తెచ్చుకోలేకపోయింది కమలం పార్టీ. బొటాబొటీ మెజారిటీతో కమలం పార్టీ గట్టెక్కింది. బీజేపీ విజయం కంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు బీజేపీ కి మైనస్ పాయింట్‌ గా మారింది. ఎన్డీయే కూటమికి 400 సీట్లు  ఒక సుదూర స్వప్నంగానే మిగలనుంది.

   18వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. భారతీయ జనతా పార్టీ విజయం మోగించింది. అయితే ఇది ఘన విజయం ఎంతమాత్రం కాదు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు తక్కువ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ విజయాలను లోతుగా పరిశీలిస్తే ఇందులో కమలనాథుల ఘనత కన్నా ఇండియా కూటమిలో నాయకత్వలేమి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని గాంధీ కుటుంబమే నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మినహా కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. వారివారి నియోజకవర్గాలకు పరిమిత మయ్యారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే అనేక నియోజక వర్గాల్లో బీజేపీకి కాంగ్రెస్ బ్రేకులు వేసింది. సామాన్య ప్రజల్లో బీజేపీ పట్ల కొంతమేర వ్యతిరేకత ఏర్పడిన మాట వాస్తవం. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే చెప్పవ చ్చు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకుని తీరాలి. ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాలు తమ తమ రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటే, కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. మొత్తంమీద ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే ఒక సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ చేజేతులా జారవిడుచుకుందని చెప్పవచ్చు.

  సీట్ల సంఖ్య ఎలాగున్నా ప్రతి ఎన్నికను ఒక యుద్ధంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అది మున్సిపల్ ఎన్నిక కావచ్చు. లోక్‌సభ ఎన్నిక కావచ్చు. దీంతో సహజంగా లోక్‌సభ ఎన్నికల నగారా మోగడానికి ముందే పెద్ద ఎత్తున కసరత్తు చేసింది భారతీయ జనతా పార్టీ. వరుసగా రెండుసార్లు అధికారానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో వ్యవహరించింది. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అనుగు ణంగా బీజేపీ నాయకులు ఎత్తుగడలు వేశారు.వ్యూహాలు పన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడానికి కమలనాథులు సర్వశక్తులు ఒడ్డారు.

  పార్లమెంటు ప్రవాస్ యోజన. ఇదొక ప్రత్యేక కార్యక్రమం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. దేశవ్యాప్తంగా 144 నియోజకవర్గాల్లో చాలా కొద్ది పాటి ఓట్ల తేడాతో కమలం పార్టీ ఓడిపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. దీంతో బీజేపీకి కేవలం 303 సీట్లే దక్కాయి. ఈ నేపథ్యంలో ఈసారి కిందటిసారి ఎన్నికల్లో ఓడిపోయిన 144 నియోజకవర్గాల్లో ఎలాగైనా విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ దాదాపు రెండు సంవత్స రాల కిందటే నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగా పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతో ఒక ప్రత్యేక కార్యక్ర మాన్ని రూపొందించింది. బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టిన 144 నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

   అబ్‌ కీ బారీ చార్ సౌ పార్ అంటూ ఎన్డీయే కూటమికి 400 సీట్లను లక్ష్యంగా ఫిక్స్ చేశారు నరేంద్ర మోడీ. అయితే ఎన్డీయే కూటమికి 400 సీట్లు గెలుచుకోవడం అంత సులభంగా లేదు. 400 సీట్ల లక్ష్య సాధనలో ఎన్డీయే కూటమి వెనుకబడటానికి అనేక కారణాలున్నాయి. నరేంద్ర మోడీ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నామమాత్రంగా తయార య్యాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక సీబీఐ, ఈడీ తరచూ వార్తల్లోకి రావడం మొదలైంది. బీజేపీ యేతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులపై కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కేసులం టే అలా ఇలా కాదు చాలా పెద్ద పెద్ద కేసులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కంటాక్స్, నార్కోటిక్ కంట్రోల్‌ బోర్డు వంటివి రంగంలోకి దిగుతు న్నాయి. నరేంద్ర మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా, వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పు తున్నారన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో నెలకొంది.

   గత పదేళ్లుగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న అనేక నిర్ణ‌యాలు రాజ్యాంగంలోని స‌మాఖ్య స్ఫూర్తి ని దెబ్బ‌తీసేలా ఉన్నా యి. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించివేస్తోంది. మ‌న‌దేశంలో అనేక జాతుల‌కు చెందిన ప్ర‌జ‌లు న్నారు. భిన్న‌త్వంలో ఏక‌త్వం భార‌త‌దేశ ప్ర‌త్యేక‌త‌. ఈ నేప‌థ్యంలో ఫెడ‌ర‌లి జానికి రాజ్యాంగ నిర్మాత‌లు పెద్ద పీట వేశారు. కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్వ‌చ‌నం యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్ త‌ప్ప మ‌రొక‌టి కాదు. రాజ్యాంగం ప్ర‌కారం కేంద్రంలో ఉండేది ”సమాఖ్య ప్ర‌భుత్వ‌”మే. ఈ నేపథ్యం లో బీజేపీ సర్కార్‌ వ్యవహరించిన తీరుపై విద్యావంతుల్లో వ్యతిరేకత ప్రబలింది.

  బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో పెనుమార్పులు సంభవిస్తాయన్న ప్రచారం ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా వచ్చింది. ఈ ప్రచారంతో విద్యావంతుల్లో ఆందోళన మొదలైంది. అంతేకాదు ఒక దశలో రిజర్వేషన్లను బీజేపీ ఎత్తివేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అప్పటి వరకు కమలం పార్టీకి పటిష్టమైన ఓట్‌బ్యాంక్ గా ఉన్న కొన్ని బలహీనవర్గాల్లో ఆలోచన మొదలైంది. ఈ వర్గాల్లో అనేకానేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కారణాలన్నీ బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడానికి ప్రధాన కారణాలయ్యాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్