ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మరోసారి టార్గెట్ చేసింది బీజేపీ. సామాన్యుడిని అని చెప్తూ రాజభవనాలు ఎందుకని ప్రశ్నిస్తూ శీష్ మహల్ వీడియోను రిలీజ్ చేసింది. సీఎంగా ఉన్నప్పుడు సెవెన్ స్టార్ రిసార్టును తలపించేలా కేజ్రీవాల్ తన అధికారిక భవనాన్ని నిర్మించారంటూ ఓ విడియోను బయటపెట్టింది. లిక్కర్ స్కామ్‌లో వచ్చిన నల్లధనంతో కేజ్రీవాల్ శీష్ మహల్‌ను కట్టారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. అయితే మరో రెండు నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.