దేశంలో నాలుగు రాష్ట్రాల్లో పార్టీ నూతన అధ్యక్షులను నియమించింది బీజేపీ(BJP) అధిష్టానం. బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. బీహార్ రాష్ట్రానికి సామ్రాట్ చౌదరి, ఢిల్లీకి వీరేంద్ర సచ్ దేవా, రాజస్థాన్ రాష్ట్రానికి సిపి జోషి, ఒడిశా రాష్ట్రానికి మన్ మోహన్ సామలను నియమిస్తూ జేపీ నడ్డా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో ఓడిశాలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం.. నూతన అద్యక్షులను ప్రకటించడం తాజా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.