స్వతంత్ర వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 రోజుల నుండి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. ఇటీవల అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, సూపరిండెంట్లు ట్రాన్స్ ఫర్ చేసిన సమయం నుండి కొత్త సర్టిఫికెట్ జారీ నిలిచిపోయిందని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు వెల్లడించారు. స్కూల్ అడ్మిషన్స్ సమయంలో బర్త్ సర్టిఫికెట్ లు కీలకం కానున్న సమయంలో సర్టిఫికెట్ లు కరెక్షన్ కాకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 15 వేల కరెక్షన్ అప్లికేషన్స్ నిలిచిపోయాయి. సుమారు 30 వేల బర్త్ సర్టిఫికేట్ లు,15 వేల డెత్ సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉన్నాయి.


