ప్రతి తెలుగింట్లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి, ప్రతి సీజన్‌లో ఒక సరికొత్త సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్” సీజన్ 7 గత ఆదివారం ముగిసిన సందర్భంగా నిర్వహించిన “వాచ్ పార్టీ”, “త్రెడెతాన్” ఎంటర్ టైన్మెంట్ కి న్యూ ఏజ్ ఎక్స్ప్రెషన్ గా నిలిచింది. మెటా, స్టార్ మా సంయుక్తంగా నిర్వహించిన ఈ అద్భుతమైన ఈవెంట్ కి హైదరాబాద్ లోని మెటా కార్యాలయం వేదిక అయింది. గత బిగ్ బాస్ సీజన్స్ నుంచి కరిష్మాటిక్ హౌస్ మేట్స్, ఎనర్జిటిక్ యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో దూసుకుపోతున్న టీవీ సెలెబ్రిటీలు – హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ ఈవెంట్ ని గ్రాండియర్ అనే పదానికి కి కొత్త డెఫినిషన్ గా మార్చేశారు.
స్టార్ మా, మెటా మార్కెటింగ్ టీమ్స్ కలిసి విలక్షణంగా నిర్వహించిన ఎంటర్ టైనింగ్ యాక్టివిటీస్ – ఆహూతులకు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చూస్తున్న ఫీల్ కలిగించాయి. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గురించి త్రెడ్స్ లో ఎంగేజింగ్ గా జరిగిన కన్వర్సేషన్స్, లైవ్ కామెంటరీ, బిగ్ బాస్ కి సంబంధించిన ప్రశ్నలు, వాటి ఆప్షన్స్, బింగో, టాస్కులు ఈవెంట్ ని రక్తి కట్టించాయి. త్రెడెతాన్ లో బిగ్ బాస్ గత సీజన్స్ కంటెస్టెంట్స్ తో ఫైర్ సైడ్ చాట్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
అర్ జె శ్వేత, అర్ జె చైతు ఈవెంట్ మొత్తాన్ని సరదా సరదాగా నడిపించారు. ఎనర్జీ ప్లస్ , తమడా వంటి లీడింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా స్పేస్ లో బిగ్ బాస్ గురించి త్రెడ్స్ లో అద్భుతంగా స్వరం వినిపించేందుకు ఇక్కడికి వచ్చారు.
టెలివిజన్‌లో విజేతను ప్రకటించేవరకు రాత్రి వరకు ఈవెంట్ జరిగింది. రైతు బిడ్డ గా అందరి హృదయాలను గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కింగ్ నాగార్జున అక్కినేని ఆరుగురు ఫైనలిస్టుల మధ్య హోరాహోరీ గా ఆటని నడిపించారు. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసేలా మాయ చేశారు నాగార్జున. వాచ్ పార్టీ కూడా అంతే ఎనర్జిటిక్‌గా ముగిసింది.