ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ సినిమా టీమ్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఈ వారంతంలో పవన్ కల్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ ఆగమనం ఉంటుందని ప్రకటించింది.
మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.