స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి కూడా నిరాశే మిగిలింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. సూరత్ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో రాహుల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. అనంతరం తుది తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. వేసవి సెలవుల తర్వాత తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరుపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సూరత్ కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. వాదనలు విన్న సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ విధిస్తూ తీర్పు ఇచ్చింది.