కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. తనకు అనవసరంగా షోకాజ్ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్వర్ రెడ్డి.. గత రాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. ఖర్గేను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడాలని ఆయన ప్రయత్నించారు. అయితే ఆకస్మికంగా ఈరోజు ఉదయం బీజేపీ నేతలు ఈటల రాజేందర్(Etela Rajender), బండి సంజయ్(Bandi Sanjay), తరుణ్ చుగ్(Tarun Chugh) లతో మహేశ్వర్ రెడ్డి భేటి అయ్యారు. అనంతరం రాజకీయంపై పునరాచన చేసుకొని ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక లేఖను ఖర్గేకు పంపారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సమావేశం అయ్యారు. ఆయన సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం హర్షణీయమన్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర ఇంచార్జి శ్రీ తరుణ్ చుగ్ ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రజలకు చేరేలా చూస్తామన్నారు.
Read Also: భాగ్యనగరం నడి బొడ్డున 125 అడుగుల భారీ విగ్రహం.. రేపే ఆవిష్కరణ
Follow us on: Youtube, Koo, Google News


