26.5 C
Hyderabad
Saturday, March 14, 2026
spot_img

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బిగ్ షాక్‌

      శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. అనం తరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. దళిత యువకులకు శిరోముం డనం కేసులో త్రిమూర్తులుతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 16వ తేదీన విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో విశాఖ కోర్టు తీర్పును తోట త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తోట త్రిమూర్తులు అభ్యర్థనను తోసిపుచ్చి.. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్