36.1 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

చంద్రబాబుకు బిగ్‌ షాక్‌..స్కిల్ కేసులో బెయిల్ పై విచారణ వాయిదా

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగిలింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాయర్లు సమయం కోరడంతోనే కోర్టు వాయిదా వేసింది. ఈ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. దీంతో చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగిలింది.

మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్​ను దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్