21.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

వింబుల్డన్ లో పెను సంచలనం..

స్వతంత్ర వెబ్ డెస్క్: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్, ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న పోలాండ్ యువ సంచలనం ఇగా స్వియోటెక్‌కు భారీ షాక్ తగిలింది. వింబూల్డన్ తొలి క్వార్టర్స్ పోరులో ఉక్రెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 76వ ర్యాంకర్ ఎలీనా స్వితోలినా.. స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో స్వితోలినా.. 7-5, 6-7 (5/7), 6-2 తేడాతో స్వియాటెక్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.

తొలి సెట్ ను స్విటోలినా చేజిక్కించుకోగా, రెండో సెట్ లో ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ బయటపడిన స్వైటెక్, ఆ సెట్ ను టైబ్రేకర్ లో గెలుచుకుంది. అయితే మూడో సెట్ లో అదే ఊపు కనబర్చడంలో విఫలమైన స్వైటెక్ ప్రత్యర్థికి తేలిగ్గా తలవంచింది. చివరి సెట్ లో స్విటోలినా పలుమార్లు స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేయడమే అందుకు నిదర్శనం. కాగా, సెమీస్ లో స్విటోలినా.. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వోండ్రొసోవాతో తలపడనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్