సినీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం దిశగా మరో కీలక అడుగు పడింది. గద్దర్ అవార్డు కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. డా. బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. గత అక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. శనివారం మరోసారి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
గద్దర్ అవార్డు లోగో, విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చిస్తున్నారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.