Cheddi Gang | విజయవాడలో కలకలం సృష్టించిన చెడ్డి గ్యాంగ్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు విచారించారు. అతని వద్దనుండి కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రస్తుతం కర్ణాటక జైల్లో వేరే కేసులో ఉన్న నిందితుడు.. 2022లో జరిగిన చెడ్డి గ్యాంగ్ చోరీల్లో కీలక పాత్ర పోషించాడు. పీటీ వారెంట్ మీద పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత సొత్తు రికవరీ చేశారు. అనంతరం కర్ణాటక జైలుకి తరలించారు. కాగా, ఇప్పటికే పలువురు చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.