19.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

మంత్రరాశుల వెనుక ‘శ్రీనివాస్’కి దైవబలం పుష్కలం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: అఖండ కాల స్వరూపాలైన మంత్రరాశుల్ని ఒక మహాసాధనగా అపురూప అఖండ గ్రంథాలుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దైవీయ చైతన్య లక్ష్యం వెనుక ఉన్న అసాధారణ నిస్వార్ధ సేవ, అందమైన భాష, భక్తి తన్మయత్వం మామూలు విషయాలు కావని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కె.గీతామూర్తి సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’సుమారు 350 పేజీల దివ్య గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించి తొలిప్రతిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి అందించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బలమైన సంకల్పాలతో పవిత్ర మార్గంలో ప్రయాణిస్తున్న పురాణపండ శ్రీనివాస్ అచ్చమైన భక్తి తత్వానికి దైవబలం మహాబలంగా మహా మంగళ కార్యాలు చేయిస్తుందని చెప్పారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు కె.గీతామూర్తి మాట్లాడుతూ శ్రావణ పుణ్య మాసంలో ఈ పవిత్ర శ్రీ కార్యాన్ని తాను భుజాలకెత్తుకోవడానికి తన తల్లితండ్రుల పుణ్యం, చిన్న నాటి నుండీ సంస్కారప్రదమైన వాతావరణంలో జీవనం సాగుదామని పేర్కొంటూ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని స్పష్టం చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది మహిళా శ్రేణులకు ఈ ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంథాన్ని గీతామూర్తి స్వయంగా పంచిపెట్టారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు లకు ప్రముఖ ధార్మిక గ్రంధాల ప్రచురణ సంస్థ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ అధినేత గొల్లపూడి నాగేంద్ర కుమార్ ఈ ‘ శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ ‘ గ్రంధాన్ని బహూకరించారించడమే కాకుండా … రాజమహేంద్రవరం నగరంలోని అనేక ఆలయాలకు సైతం నాగేంద్రకుమార్ దంపతులు వీటిని ఉచితంగా పంచడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest Articles

లండన్‌ పర్యటనకు వైఎస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు వెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి కాన్వకేషన్‌ సందర్భంగా జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్