స్వతంత్ర, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఓ బహుమతి అందజేశారు. 600 కేజీల మామిడి పండ్లను ఆమెకు కానుకగా పంపించారు. దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ‘హిమ్‌సాగర్, లాంగ్రా’ వంటి రకాలకు చెందిన మామిడి పండ్లను పంపారని.. గతేడాది కూడా ఇలాగే బహుమతి ఇచ్చారని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ తెలిపింది. మమతాతో పాటు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ బంగ్లా ప్రధాని మామిడి పండ్లను పంపినట్లు పేర్కొంది. గతేడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, త్రిపుర, అసోం సీఎంలకు కానుకగా మామిడి పండ్లను బహుకరించారు. కాగా భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలున్నాయని సంగతి తెలిసిందే.