ఐపీఎల్ చరిత్రలోనే ఒక శాతం అవకాశం నుంచి ప్లే ఆఫ్‌కు చేరిన టీమ్‌గా బెంగళూరు జట్టు నిలిచి పోయింది.హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై RCB అద్భుతమైన విజయం సాధించింది. సీజన్ బిగినింగ్‌లో వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో 10కి చేరిన RCB తర్వాత పుంజుకొని అద్భుతమైన ఆట తీరుతో టాప్ 4కి చేరింది. నువ్వా నేనా అన్నట్టు సాగినా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులను చేసింది.ఇక ప్లే ఆఫ్‌కు చేరాలంటే RCB మ్యాచ్ 18 పరుగుల తేడాతో గెలవాలి. ఇక టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి, 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోగా, బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. RCB బ్యాటింగ్‌లో డ్లుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్రీన్ రాణించగా, బౌలింగ్‌లో యాష్ దయాళ్ 2 వికెట్లు, గ్రీన్, మ్యాక్స్ వెల్, మహ్మద్ షిరాజ్, ఫెరుగ్ సన్ ఒక్కో వికెట్ తీసి టీమ్‌ను గెలిపించారు. తమ అభిమాన టీమ్ గెలవడంతో పాటు ప్లే ఆఫ్‌కు చేరడంతో RCB ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు.