బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకం అంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కేవలం ఓట్లు దండుకునేందుకే మరోసారి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. పదేళ్ల పాటు కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఢిల్లీకి కప్పం కడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో గొప్పగా హామీలు గుప్పించి ఇప్పుడు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు జనం బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.


