కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రి పదవి చేపట్టారు. పదవీ బాధ్యతల కార్యక్ర మానికి నాయకులు, కార్యకర్తలను అనుమతించ లేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిప తులు విద్యారణ్య భారతి స్వామిజీ హాజరై బండి సంజయ్‌కు ఆశీర్వచనం ఇచ్చారు.