35.9 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

V6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా..!!

Bandi Sanjay |బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది మరో మూడు, నాలుగు నెలలేనని .. ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కుండ బద్దలు కొట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభలా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సభలో కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని అన్నారు. ఏదేమైనా అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలిస్తామని.. నెలరోజుల్లో డీఏలను చెల్లిసమని ..ఆపై వెంటనే పీఆర్సీని నియమించి అమలు చేస్తామని ప్రకటించారు.

కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు.. టీచర్ల, ఉద్యోగుల సమస్యలలపై ఎందుకు గళం విప్పట్లేదని బండి(Bandi Sanjay) మండిపడ్డారు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని మందలించారు. వీ6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా… గతంలో ఏబీఎన్, టీవీ9 ను బ్యాన్ చేస్తే ప్రజలంతా వ్యతిరేకించారు. ఈసారి V6 ను రద్దు చేస్తే తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ నేతలను ఉరికించి.. ఉరికించి కొడతారు అని అన్నారు.

Read Also: బీజేపీలో చేరనున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

Follow us on:   Youtube  Instagram

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్