స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనంతరం మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్న బాలినేనిని తాడేపల్లి రావాలని కబురు పంపించారు. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని జగన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గించేలా కొందరు పనిచేస్తున్నారని సీఎం జగన్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన జగన్.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా బాలినేనిని బుజ్జగించినట్టు సమాచారం.